/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t100733820-2025-11-02-10-08-00.jpg)
Tappachabutra CI suspended
CI suspended : నగరంలోని టప్పాఛబుత్రా పోలీస్​ స్టేషన్​ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్​ ఈ చర్యలు తీసుకున్నారు. సీఐ బి.అభిలాశ్​ను సస్పెండ్​చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కొద్దిరోజుల కింద గంగాబౌలి ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్​చేస్తుండగా, కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు, వారిని అక్కడ ఏం చేస్తు్న్నారని ప్రశ్నించారు.
వీరిని చూసిన కానిస్టేబుల్స్​అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా వినలేదు. పైగా సదరు వ్యక్తులు కానిస్టేబుల్స్​ను దుర్భాషలాడారు. ఈ సందర్భంగా పోలీసులు వారి మధ్య ఘర్షణ జరిగింది. స్టేషన్​కు వెళ్లిన కానిస్టేబుల్స్​ఈ మేరకు అర్ధరాత్రే స్టేషన్​కు ఫిర్యాదు చేశారు.విషయాన్ని సీఐ అభిలాశ్​కు చెప్పినా యాక్షన్​తీసుకోలేదు. అయితే, ఫిర్యాదు అందిన వెంటనే కాకుండా మరుసటి రోజు ఉదయం కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లటంతో ఏసీపీతో విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్నారు. , ఎంక్వైరీలో అది నిజమేనని తేలడంతో సీపీ సస్పెండ్ చేశారు.
ఈ విషయంలో సీఐ అభిలాష్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో ఇద్దరు అధికారులు సస్పెండ్ కావటం గమనార్హం. కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడిన నిందితుడు పారిపోవటంలో సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్రల్ జోన్ ఎస్​ఐ శ్రీకాంత్ గౌడ్​ ను ఇటీవలే విధుల్లో నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
Follow Us