/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-07-15-34.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో తానే గెలువబోతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని అన్నారు. టైట్ ఫైట్ అయితే ఉండదన్నారు. దాదాపుగా 45 వేలకు పైగా మెజార్టీ వస్తుందన్నారు నవీన్ యాదవ్. అంతకుముందు ఆయన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.
48.49% ఓటింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, 1,94,631 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 48.49% గా నమోదైంది. ఓటింగ్ 407 పోలింగ్ బూత్‌లలో జరిగింది. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట షేక్​పేట డివిజన్ ఓట్లు లెక్కించి, ఆ తర్వాత వరుసగా మిగతా 6 డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత EVM లలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది. ఉదయం 11.30 గంటల కల్లా విజయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైంది.
Follow Us