Jubilee Hills : మొదలైన కౌంటింగ్...  పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో కాంగ్రెస్ లీడ్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మొదలైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

New Update
congress

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మొదలైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ఓట్లను లెక్కించారు. లెక్కింపు పూర్తి అయింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది.  కాంగ్రెస్ కు 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 ఓట్లతో ఉన్నాయి. EVM లలోని ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

మొదటి ట్రెండ్‌లు ఉదయం 10 గంటలకల్లా, తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గెలుపు ఓటముల తేడా కేవలం 3% నుండి 8% ఓట్ల వరకు ఉండే అవకాశం ఉందని, పోరు హోరాహోరీగా ఉంటుందని సర్వేలు సూచించాయి.బీజేపీ మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి. 

Advertisment
తాజా కథనాలు