Compensation : ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా పటేలా .. బోరున ఏడ్చేసిన తండ్రి!

చేవెళ్ల బస్సులో ప్రాణాలు కోల్పోయిన తాండూరుకు చెందిన ప్రమాద బాధితులు తనూష, సాయిప్రియ, నందిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారం అందజేశారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

New Update
pic

చేవెళ్ల బస్సులో ప్రాణాలు కోల్పోయిన తాండూరుకు చెందిన ప్రమాద బాధితులు తనూష, సాయిప్రియ, నందిని కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున పరిహారం అందజేశారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, RTC తరపున రూ.2 లక్షల చెక్కులను ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్‌కు అందజేశారు.  ఈ సందర్భంగా ఎల్లయ్య గౌడ్ ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా అంటూ ఆయన బోరున ఏడ్చేశారు. రెండో కూతురు ఉద్యోగం చేస్తూ రూ.60 వేలు పంపేదంటూ ఎల్లయ్య విలపించారు. కన్నీళ్లు పెట్టుకున్న ఎల్లయ్యను  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓదార్చి దైర్యం చెబుతూ ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ సంఘటన అక్కడున్న వారిని  కంటతడి పెట్టించింది. 

ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా

తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ అతివేగం, నియంత్రణ కోల్పోవడమే అని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు మలుపు వద్ద టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోరానికి దారితీసిందని ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్ గానీ ప్రమాదానికి కారణం కాదని, బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో ఎలాంటి ప్రమాదాలు లేవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అయితే, టిప్పర్ యజమాని మాత్రం ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి గుంతలు తప్పించే ప్రయత్నంలో తమ వాహనాన్ని ఢీకొట్టాడని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

ఘోర ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. రోడ్డు భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. డిసెంబర్ 15 లోపు పూర్తి నివేదిక సమర్పించాలని రవాణా, హోం శాఖ, కలెక్టర్, ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు