GHMC Elections: GHMC ఎన్నికలపై రేవంత్ సర్కార్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. GHMC విభజన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తాజాగా మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌ను 4 కార్పొరేషన్‌లుగా విభజిస్తాం అని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు నలుగురు మేయర్‌లు ఉంటారని అన్నారు.
కమలం వికసించింది..
గత GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. 150 స్థానాల్లో కేవలం 2 మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌లో సున్నా స్థానాలు వచ్చాయి. GHMC విభజనతో మెరుగైన ఫలితాలు సాధించాలనే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. కాగా గత GHMC ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రం దూకుడుగా వ్యవహరించింది. ఆనాడు బండి సంజయ్ అధ్యక్షతన GHMC ఎన్నికల్లో కమలం వికసించింది. దాదాపు 60 స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ కు మాత్రం సీట్లు తగ్గాయి.
Also Read : రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. గుండెపోటుతో కూతురు మృతి!