నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..గుండెపోటుతో కుమార్తె మృతి

సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న ఛాతి నొప్పితో ఆమె AIG ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

New Update
gayatri

Actor Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో  హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి వెంటనే తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ పెళ్లి.  ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాదే స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రేమ వివాహం చేసుకున్న తరువాత కుమార్తెతో మాటలు లేవని ఆయన తెలిపారు. 

Also Read :  హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

Advertisment
తాజా కథనాలు