సొంతూర్లో దసరా పండుగ జరుపుకున్న సీఎం రేవంత్..

దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.

kondareddypalli
New Update

దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న ఆయనకు డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత రేవంత్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.

Also Read: త్వరలో కాలుష్యరహిత 20 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి: భట్టి

అలాగే రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. సీఎం రేవంత్ వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ , కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

#cm-revanth #telugu-news #telangana-news #kondareddypalli #CM Revanth Reddy Visited Kondareddy Palli
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe