CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అడిగింది వెయ్యి కోట్లు.. ఇచ్చింది?
మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80 కోట్లు, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,432 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.
వర్షాల సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ విజయవాడ వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే కేంద్ర సాయం ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి చౌహాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని వరద సాయం కింద రూ.1000 కోట్లు అడిగితే రూ.416.80 కోట్లు కేటాయించిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాగా ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వరద సాయం కోసం మరిన్ని నిధులు కేటాయించాలని పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
Also Read: ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్