CM Revanth: జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ సంచలన హామీ

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం దొంగలపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

New Update

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీలు మన ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు మహిళా సెంటిమెంట్‌తో ఓటేస్తే మళ్లీ మోసపోతామని ఆరోపించారు. కేటీఆర్‌ వేల కోట్ల ఆస్తులు సంపాదించి చెల్లెలికి పావులా కూడ ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌కు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తోందని.. అందుకే కాళేశ్వరం దొంగలపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: అయ్యో బిడ్డలు.. తల్లడిల్లిన తాండూరు.. ఎటు చూసినా ఏడుపే.. కన్నీటి యాత్ర!-VIDEO

కేసీఆర్‌ను బీజేపీ ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనానికి కూడా సిద్ధమైందని ఆరోపించారు. ఫార్ములా ఈ కారు కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్‌ పర్మిషన్ కోరితే ఇవ్వడం లేదని అన్నారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు