Delimitation డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం డీలిమిటేషన్‌ విషయంలో ఎంకే స్టాలిన్‌ను సమర్థించారు. మార్చి 22న చెన్నైలొ జరగబోయే ఆల్ పార్టీ మీటింగ్‌కు ఎంకే స్టాలిన్‌ నుంచి తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. హైకమాండ్ అనుమతిస్తే ఆ మీటింగ్‌కు వెళ్తానని రేవంత్ అన్నారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనలో డీలిమిటేషన్‌పై మాట్లాడారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఓ బృందాన్ని పంపి, డీలిమిటేషన్‌కు సంబంధించిన సమావేశానికి  ఆహ్వానించారని తెలిపారు.  మార్చి 22న చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందని.. పార్టీ హైకమాండ్ అనుమతిస్తే ఆ మీటింగ్‌కు వెళ్తానని రేవంత్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇది డీలిమిటేషన్ కాదు, దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి అని అభివర్ణించారు. డీలిమిటేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also read: Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?

Also read: Cryptocurrency Fraud: 96 బిలియన్ డాలర్ల స్కాం.. ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌ని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

దక్షిణాది రాష్ట్రాల ప్రజలతో విభేదాలు తీర్చుకోవడానికి బీజేపీ ఇదంతా చేస్తోంది. ఇక్కడి రాష్ట్రాల ప్రజల్ని బీజేపీని ఎదగనివ్వట్లేదని ఆరోపించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడు సీఎం వైఖరిని ఆయన స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు