కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను పెంచాలి: సీఎం రేవంత్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని.. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. By B Aravind 10 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక సంఘానికి సీఎం సూచించారు. తెలంగాణను 'ఫ్యూచర్ స్టేట్'గా పిలుస్తున్నామని.. బలమైన పునాదులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు భారీగా అప్పులు చేశారని.. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో అధికంగా రుణాలు కట్టేందుకే పోతున్నాయని అన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాలని లేకపోతే రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని తెలిపారు. రుణ సమస్యను పరిష్కరించేందుకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్ర రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేకపోతే అదనపు ఆర్థిక సాయం చేయాలన్నారు. తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంతో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని పేర్కొన్నారు. #cm-revanth #telugu-news #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి