/rtv/media/media_files/2025/02/01/P3zFhmgBdk2jrInmRicz.jpg)
cm revanth reddy on mla's meeting
తెలంగాణ కాంగ్రెస్లో పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో వీరంతా ఓ ఫామ్ హౌజ్ లో మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మంత్రి పొంగులేటి తీరుపై ఈ పదిమంది ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉన్నారని, భవిష్యత్తు కార్యచరణలో భాగంగానే వీరంతా భేటీలో సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి పొంగులేటి స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ పది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే భేటీ అయిన పదిమంది ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారని.. కలిసి మాట్లాడుకుందామని వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.
రంగంలోకి సీఎం రేవంత్
సీక్రెట్ గా భేటీ అయిన పది మందిలో నలుగురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఫోన్ ద్వారా మరో 6 మంది ఎమ్మెల్యేలు వీరికి టచ్‌లోకి వచ్చారని సమాచారం. ఏడాదిలో పనులు కాకపోవడం మీద వాళ్లు అసంతృప్తిగా ఉన్నారట. బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని భావిస్తున్నారట. వ్యవహారం పెద్దదిగా మారితే ప్రభుత్వానికే ప్రమాదామని భావించి సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
అందుకే హుటాహుటిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై సీఎం వారితో చర్చించారు. ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పై సీఎం రేవంత్ ఆరా తీశారని తెలుస్తోంది. వారితో స్వయంగా తానే మాట్లాడుతానని సీఎం అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని మంత్రులకు దిశానిర్థేశం చేశారు. ప్రభుత్వ అంతర్గత అంశాలపై కూడా సఎం చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు రేవంత్ సూచించారు.
ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ అంశం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ప్రభుత్వం మీకు నచ్చిందని పోల్ పెడితే 70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడటంతో పార్టీలోని అగ్రనేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఇదే అంశంపై మాజీ సీఎం. బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ కూడా వ్యంగంగా స్పందించారు. రాజకీయాల్లో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవ్వడం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభకు ప్లాన్ చేయడం, ఇప్పుడు కాంగ్రెస్ లోని 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టడం పార్టీ లోని అగ్రనేతలను ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : నేటి బడ్జెట్ తో ఆ విషయం తేలిపోయింది.. KTR సంచలన వ్యాఖ్యలు!