తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024ను ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. By B Aravind 03 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తోన్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 (ChiefMinistersCup 2024)ను ఎల్బీస్టేడియం వేదికగా సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడల మస్కట్, లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమం చివర్లో క్రీడా జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భాంగా సీఎం రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''క్రీడాకారులు కఠోరమైన శ్రమతో రాణించాలి. ఇటీవలి ఒలంపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయాం. 2028 లో భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ప్రతిజ్ఞ తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ సర్కా్ర్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం. Also Read: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్ బాక్సింగ్‌లో దేశానికి తలమానికంగా క్రీడాకారిని నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ఎలా ప్రోత్సహిందో చెప్పడానికి నిఖత్ ఒక నిదర్శనం. అండర్ 17 జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌ను తెలంగాణ దత్తత తీసుకోవాలని నిర్ణయించాం. వారికి కావలసిన శిక్షణను హైదరాబాద్‌లో అందిస్తామని ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడాను. పట్టుదల, ప్రయత్నం ఉంటే విజయం సాధిస్తారు. అందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉదాహరణ. 16 ఎకరాల్లో ఉన్న ఆ ఒక్క యూనివర్సిటీ ఒలంపిక్స్‌లో ఏకంగా 32 బంగారు పతకాలను సాధించింది. క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YoungIndiaSportsUniversity), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YoungIndiaSportsAcademy)లను స్థాపించాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. గురుద్వార్, మందిరం, మసీదు, ఒక చర్చ్ వంటి ప్రార్థనా మందిరాలకు ఎవరికి వారు వెళ్తారు. కానీ మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడామైదానం ఒక్కటే. ఎల్బీస్టేడియం అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది నగర క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చలేవు. తల్లిదండ్రులకు దుఃఖం, మీ కుటుంబానికి కష్టాలు తప్ప. అదే క్రీడల్లో రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా మీ కుటుంబానికి గౌరవం తీసుకొస్తారు. అంతే కాకుండా దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే ఇనుమడించే క్రీడాకారులుగా రాణిస్తారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని'' సీఎం రేవంత్ అన్నారు. ఇదిలాఉండగా.. ఈ కార్యక్రమంలో క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు త్రివిధ దళాలకు చెందిన ప్రతినిధులు, క్రీడాకారులు పెద్దఎత్తున హాజరయ్యారు. #cm-revanth #telangana #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి