CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్.. వారికి కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 90శాతం ధాన్యం సేకరణకు కృష్టి చేసినందుకు అధికారులను రేవంత్ రెడ్డి అభినంధించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులు, ఎరువులు, విత్తనాల పంపిణీపై పర్యక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

New Update
video conference

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులు, కలెక్టర్లను అభినందించారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ.12184 కోట్లు చెల్లించామన వివరించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌తో చెప్పారు.

ఈ ఏడాది సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయమని చెప్పారు. 

నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలవారీగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోమని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భూభారతి పేద రైతులకు చుట్టం, దానిపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు చాలా కీలకమని అన్నారు. నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందని అన్నారు. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేసి మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండని రేవంత్ రెడ్డి చెప్పారు. 

cm-revanth-reddy | video conference | telangana-ministers | telangana ministers latest news | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు