గుత్తాధిపత్యాన్ని సహించం.. బీర్ల ధరల పెంపుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణలో త్వరలో కొత్తరకం బ్రాండ్ బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం  అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  ఈ మేరకు కంపెనీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు.

New Update
revanth, beer

revanth, beer Photograph: (revanth, beer )

తెలంగాణలో త్వరలో కొత్తరకం బ్రాండ్ బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం  అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  ఈ మేరకు కంపెనీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.  శనివారం రోజున కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎక్సైజ్ ఆఫీసర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.  అనుమతులు ఇచ్చేముందు కంపెనీల నాణ్యత ప్రమాణాలు,  సరఫరాసామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక జరిగాలని సీఎం సూచించారు.  కొత్త కంపెనీలు ధరఖాస్తు చేసుకునేందుకు నెలరోజుల పాటు టైమ్ ఇవ్వాలన్నారు సీఎం.  కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలని అధికారులను అదేశించారు సీఎం రేవంత్.   లిక్కర్ తయారీలో కంపెనీలు గుత్తాధిపత్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ అధికారులకు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగబోతున్నాయనే వార్తలను సీఎం ఖండించారు.  ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గమని వెల్లడించారు.  

ఒత్తిడికి తలొగ్గేది లేదు

రాష్ట్రంలో మద్యం సరఫరా చేసిన యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఇటీవల బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులుఈ సందర్భంగా  సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదన్న సీఎం  పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక ధరల పెంపు విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే నిర్ణయం ఉంటుందన్నారు.   ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు కడుతున్నామని రేవంత్ చెప్పారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా చెల్లించాలని చెప్పారు.   ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంభట్టి, మంత్రిజూపల్లి కృష్ణారావు  , సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితురులు పాల్గొన్నారు. 

Also Read :  సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు