/rtv/media/media_files/2025/11/15/fotojet-97-2025-11-15-15-33-08.jpg)
CM Revanth, MLA Naveen Yadav for Delhi
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో విజయగర్వంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. కాగా వీరంతా మొదట AICC చీఫ్ మల్లిఖార్జన్ ఖర్గేతో భేటీ కానున్నారు ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఈ సందర్బంగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయం గురించి సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు వివరించనున్నారు.--- కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో రెండు బెర్తులు ఖాళీ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటిని భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం జూబ్లీవిజయంతో మంత్రి వర్గ విస్తరణకు మార్గం సుగమం అయినట్లు భావిస్తున్న రేవంత్ రెడ్డి.ఈసారి తనకు అత్యంత సన్నిహితులు అని చెప్పుకునేవారికి మంత్రి పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ ప్రస్తుతం బీసీ అభ్యర్థి విజయం సాధించడంతో పాటు హైదరాద్‌లో కాంగ్రెస్‌కు స్థానిక సంస్థలు, బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
నగరం నుండి కేవలం నవీన్ మాత్రమే విజయం సాధించడం, అందలోనూ బీసీ కూడా కావడంతో నగరానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనతో నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఒక కొలక్కి తెచ్చి ఎన్నికలు నిర్వహించడం ద్వారా విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం రేవంత్ మొగ్గు చూపుతున్నారు.
Follow Us