Revanth : వారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. మరో నాలుగు కీలక నియామకాలు!

TG: రాష్ట్రంలో పలు నియామకాలు చేపట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ఇటిక్యాల పురుషోత్తం, మహిళ యూనివర్సిటీ ఇంఛార్జి విసిగా దనావత్ సూర్య, బాసర IIIT ఇంఛార్జి విసిగా గోవర్ధన్‌ను నియమించింది.

TELANGANA LOGO
New Update

CM Revanth Reddy : తెలంగాణలో పలు నియామకాలు చేపట్టింది రేవంత్ సర్కార్. ఇటీవల 13మంది కీలక పదవులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా మరో నలుగురికి కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ (Telangana) ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, మహిళ యూనివర్సిటీ ఇంఛార్జి విసిగా దనావత్ సూర్య, బాసర ఐఐఐటీ ఇంఛార్జి విసిగా ప్రొఫెసర్ గోవర్ధన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  35 ఏళ్ళ తర్వాత టీవీలో షారుక్ సీరియల్ సీక్వెల్.. కానీ షారుక్ ఖాన్ స్థానంలో ఎవరంటే?

ఇటీవల 13 మందికి...

ఇటీవల బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. కులాల వారీగా చూసుకుంటే ప్రకటించిన వాటిలో రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మంది ఉండగా.. గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు.. ముస్లిం నుంచి ఒకరికి పదవులు లభించాయి. త్వరలో మిగతా జిల్లాలకు గ్రం థా ల య సం స్థ ల కు ఛైర్మన్‌లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ!

వివరాలు...

  • నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ
    * సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్ 
    * కరీంనగర్- సత్తు మల్లయ్య 
    * రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి
    * వనపర్తి - జి. గోవర్ధన్
    * సంగారెడ్డి- గొల్ల అంజయ్య
    * కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి 
    * మెదక్- సుహాసిని రెడ్డి 
    * నారాయణ్‌పేట్ - వరాల విజయ్ కుమార్ 
    * నాగర్ కర్నూల్ - జి. రాజేందర్ 
    * వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి 
    * మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి
    * జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు

Also Read :  వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?

#telangana #revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe