35 ఏళ్ళ తర్వాత టీవీలో షారుక్ సీరియల్ సీక్వెల్.. కానీ షారుక్ ఖాన్ స్థానంలో ఎవరంటే?

షారుక్ ఖాన్ 1980లో తెరంగేట్రం చేసిన తొలి టెలివిజన్ సీరీస్ 'ఫౌజీ' సీక్వెల్ రాబోతోంది. అక్టోబర్ 15న మేకర్స్ 'ఫౌజీ 2' షోని ప్రకటించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ లో టీవీ నటి అంకితా లోఖండే, విక్కీ జైన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

New Update
fouji 2 (1)

Fouji 2

Fouji 2: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ 1989లో తెరంగేట్రం చేసిన చేసిన తొలి టెలివిజన్ సీరీస్  'ఫౌజీ'. ఈ సీరియల్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా ప్రధాన పాత్ర పోషించిన షారుక్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ షో షారుక్‌కి పేరు తెచ్చిపెట్టింది. 1980 దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ షో భారీ విజయాన్ని సాధించింది మరియు నేటికీ అభిమానులు దీన్ని చూడటానికి ఇష్టపడతారు. 

Also Read: 'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్

  'ఫౌజీ 2' 

ఈ క్రమంలో దాదాపు  35 సంవత్సరాల తర్వాత ఈ సీరియల్ సరికొత్త  సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తోంది. అక్టోబర్ 15న మేకర్స్  'ఫౌజీ 2' షోని ప్రకటించారు. దాంతో పాటు  'ఫౌజీ 2' లో నటించబోయే స్టార్ కాస్ట్ గురించి కూడా తెలిపారు. 

'ఫౌజీ'1 రాజ్ కుమార్ రావు తెరకెక్కించగా...   'ఫౌజీ 2' సీరీస్ కు అభినవ్ పరీక్ దర్శకత్వం వహిస్తున్నారు.  'ఫౌజీ 2' లో టీవీ నటి అంకితా లోఖండే భర్త విక్కీ జైన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సీరీస్ మళ్ళీ దూరదర్శన్‌లోనే  ప్రీమియర్ కానుంది. గౌహర్ ఖాన్, ఆశిష్ భరద్వాజ్, ఉత్కర్ష్ కోహ్లి, రుద్ర సోని, అమర్‌దీప్ ఫోగట్, అయాన్ మంచాందా, సువంశ్ ధర్, ప్రియాంషు రాజ్‌గురు, అమన్ సింగ్ దీప్, ఉదిత్ కపూర్, మాన్సీ, సుష్మితా భండారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు