BIG BREAKING : బండి సంజయ్ కు బిగ్ షాక్.. సివిల్ కోర్టు నోటీసులు!

కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు సమన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

New Update
bandi sanjay

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో  రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ఆయన ఈ దావాను దాఖలు చేశారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలను తనను ముడిపెట్టారని కేటీఅర్ ఫిర్యాదులో వెల్లడించారు.  

కేవలం రాజకీయ కక్షతో

బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో విపరీతమైన నిందారోపణలతో నీచమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారని కేటీఆర్ అరోపించారు.  అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు కేటీఆర్. తన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తొలగించాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించినవని పేర్కొన్నారు. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో, న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని కేటీఆర్‌ తన ఫిర్యాదులో తెలిపారు. భవిష్యత్తులో కూడా నిందితులు పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసును హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు.

కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు సమన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు