ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ దేశాల్లో ఎప్పుడు ఎక్కడ బాంబు పడుతుందోనని అక్కడి ప్రజలు భయాందోళనలతో కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా ఇంకా ముగిసిపోలేదు. ఇలాంటి తరుణంలో చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నట్లు సమాచారం. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?
యద్ధ సన్నాహాలు బలోపేతం చేయాలి
పలు వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బీగ్రేడ్ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సందర్శించారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సన్నాహాలను బలోపేతం చేయాలని.. దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూసుకోవాలని అన్నారు. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. దేశ భద్రత, ప్రధాన ప్రయోజనాలను కాపాడాలని సైన్యానికి సూచింనట్లు పలు వార్తా సంస్థల కథనాల్లో వచ్చాయి.
Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?
ఇటీవలే సైనిక విన్యాసం
ఆరు రోజుల క్రితం చైనా.. తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇందులో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు పాల్గొన్నాయి. వీటిలో 25 విమానాలు, 7 నావీ నౌకలు, మరో నాలుగు నౌకలు పాల్గొన్నట్లు తైవాన్ తెలిపింది. అయితే కొన్నిరోజుల క్రితం తైవాన్ అధ్యక్షుడు విలియం లై కూడా చైనా చేస్తున్న పనులను ప్రతిఘటిస్తామని ప్రకటించారు. తమపై చైనా నియంత్రణను అంగీకరించమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన డ్రాగన్ దేశం సైనిక విన్యాసానికి దిగినట్లు తెలిసింది.