యమపాశంలా చైనా మాంజాలు.. గొంతులు కోయడానికి కారణం ఇదే..!

చైనా మాంజాలు రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఎంత కట్టడి చేసినా వాటి విక్రయాలు, మరణాలు ఆగడం లేదు. జనవరి 3న కైట్స్ హోల్‌సేల్ షాపులపై పోలీసులు రైడ్స్ చేసి, ఆ మాంజాలు విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. 987 చైనా మాంజా బండిళ్లను సీజ్ చేశారు.

author-image
By K Mohan
New Update
china manja

china manja Photograph: (china manja)

ఓ పక్క చైనా వైరస్ HMPV భయపెడుతుంటే.. మరో పక్క చైనా మాంజాలు ఇండియాలో మరణశాసనం రాస్తున్నాయి. ప్రతిఏటా సంక్రాంతి సీజన్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందంగా పతంగులు ఎగరేస్తారు. కానీ.. పతంగులు ఎన్ని ప్రాణాలను బలితీస్తోందో తలుచుకుంటే బాధేస్తోంది. పతంగులు కాగితంతోనే చేస్తారు కావచ్చు. కానీ దాన్ని ఎగరేసే దారం విషయంలో మాత్రం చాలామంది చైనామాంజాను వాడుతున్నారు. జనవరి 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పతంగులకు, మాంజాల హోల్‌సేల్ షాప్‌లకు కేరాఫ్‌గా ఉన్న అఫ్జల్‌గంజ్‌, మంగళ్‌హాట్‌, ఓల్డ్‌సిటీలోని ఇతర ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. పదిలక్షల విలువైన సరుకు సీజ్ చేశారు. గాజుపూత, కెమికల్స్‌ ఉండే చైనా మాంజా అమ్మవద్దని నిబంధనలు ఉన్నా ఎందుకు విక్రయిస్తున్నారంటూ కేసులు పెట్టారు. పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 987 చైనా మాంజా బండిళ్లను(బాబిన్స్‌) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.

చైనా మాంజాలు యమ డేంజర్.. బైక్ మీద వెళ్లేవారి మెడకు చుట్టుకుంటే.. పీక తెగిపోవాల్సిందే.. అంతేకాదు వేల పక్షలు చైనా మాంజా కారణంగా చనిపోతున్నాయి. మాంజా దారం మెడకు చుట్టుకొని చనిపోయిన బైకర్ అంటూ జనవరి నెలలో వార్తలు వస్తూనే ఉంటాయి. అసలు ఈ చైనా మంజాలు ఎందుకంత డేంజర్? మన దేశానికి ఇదెలా వచ్చింది? భారత్‌లో వీటి నిషేదంపై ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? అసలు ఈ చైనా మాంజాల కథేంటో చూద్దాం రండి..

కైట్ ఫెస్టివెల్‌లో పెద్ద పెద్ద పతంగులు ఎగరేయడానికి చైనా మంజాలు వాడేవారు. వాటిని నైలాన్‌‌‌‌తో తయారు చేస్తారు. మాంజాకు గాజుని పొడి పూసిన నైలాన్, సింథటిక్ దారాలు మాంజా తయారీలో వాడుతారు. క్రమంగా చిన్న చిన్న పతంగ్‌లకు కూడా చైనా మాంజాలు వాడటం స్టార్ట్ చేశారు. వేరే పతంగ్‌‌ ధారానికి వెలిక వేసి పడగొట్టడానికి.. దారం తెగిపోకుండా ఉండటానికి ఈ చైనా మాంజాలు యూస్ చేస్తుంటారు. చైనా మాంజా తెగదు.. గాలిపటం ఎగరేసినప్పుడు పొరపాటున ధారం వదిలేయడం, వేరేవాళ్లే మాంజాధారం తెంపడం జరుగుతుంది. అది చెట్లు, బిల్డింగుల మధ్య చిక్కుకొని బైక్‌పై రోడ్డు మీద వెళ్లేవారి మెడకు చుట్టుకొని ఆ వేగానికి గొంతు కోసుకుపోతుంది. ఇలా చైనా మాంజాలు చాలామంది బైకర్స్‌ మెడకు ఉరితాడై.. పండగపూట విషాదాలు మిగిల్చాయి. 

గతకొన్ని సంవత్సరాల్లో ఇలాంటి దుర్ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. అంతేకాదు, వేల పక్షులు కూడా చైనా మాంజాల కారణంగా మృత్యువాత పడ్డాయి. దీంతోపాటు ఇవి విద్యుత్ అంతరాయానికి, రోడ్ ట్రాఫిక్‌కు కారణమైతున్నాయిని ప్రభుత్వం గుర్తించింది. చైనా మాంజాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2016లోనే వీటి అమ్మకాలను నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజాను కొనుగోలు చేసినా.. అమ్మినా నేరం. దీనిని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. పక్షులు, జంతువులకు హాని కలిగిస్తే వన్య ప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం 3 నుంచి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు.

వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒకరు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఓ జంట బైక్‌పై వెళ్తుండగా.. మాంజా మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలైయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో సుహైల్ అనే యువకుడు జనవరి 7న చైనా మాంజా కారణంగా మరణించాడు. 2024 జనవరిలో విశాఖపట్నంకు కోటేశ్వరరావు అనే సైనికుడు కూడా మాంజా దారం మెడకు చుట్టుకొని చనిపోయాడు. విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌస్‌పై వద్ద మెడకు మాంజా చుట్టుకున్నది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే గత సంవత్సరం 8 మంది చైనా మాంజాధారం మెడకు చుట్టుకొని చనిపోయారంటే చూడండి. అవి ఎంత ప్రమాదమో.. ఇవి ప్రారంభంలో చైనాలో తయారు చేసి ఇండియాకు ఎగుమతి చేసేవారు. వాటి కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని గుర్తించి 2017 జనవరి 17నే కేంద్ర ప్రభుత్వం చైనా మాంజాలు నిషేధించింది. పోటీలు పడి గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు ఒకరి పతంగ్ మరొకరు పడగొట్టడానికి ఈ చైనా మాంజా వాడుతారు. అలా తెగిపోయిన మాంజాధారం రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న వారి ప్రాణాలు తీస్తోంది.  

గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సీక్రెట్‌గా తీసుకొచ్చి విక్రయించగా, కొన్నాళ్ల నుంచి లోకల్‌లోనే తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో అవి బ్యాన్ చేశాక.. వాటిని సీక్రెట్‌గా ఇండియాలోనే తయారు చేస్తున్నారు.  వాటికున్న డిమాండ్ కారణంగా కొందరు ఎక్కువ రేట్లకు అమ్ముతూ గట్టుచప్పుడు కాకుండా చైనా మాంజాల వ్యాపారం నడిపిస్తున్నారు.  నైలాన్, సింథటిక్ దారాలకు గాజుని పొడి పూసి చైనీస్ మాంజాలు ఇండియాలోనే తయారు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు