America: అమెరికా సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన రష్యా ఫైటర్‌ జెట్‌!

రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లోకి రష్యా ఫైటర్ జెట్ దూసుకొచ్చింది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి

New Update
spacejet

America : రష్యా యుద్ధ విమానం మరోసారి అమెరికా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియోను సైనిక అధికారులు విడుదల చేశారు. మాస్కో విమానాన్ని వెనక్కి పంపడానికి అమెరికా కూడా ఎఫ్‌ -16 ఫైటర్‌ జెట్‌ ను రంగంలోకి దించారు. ఈ వీడియోలో రష్యాకు చెందిన ఫైటర్ జెట్‌ అమెరికా విమానానికి కొన్ని అడుగుల దూరం వరకు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఘటన నార్తర్న్‌ అమెరికన్‌ ఏరోస్పేస్‌ కమాండ్ పరిధిలో సెప్టెంబర్‌ 23న జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలాస్కా ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ లోకి తరచూ రష్యా విమానాలు చొచ్చుకొస్తున్నాయి. '' రష్యాకుచెందిన సు-35 విమానం అసురక్షితంగా ప్రయాణించింది. ఇది ఏమాత్రం ప్రొఫెషనల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లా అనిపించలేదు'' అని ఆ కమాండ్‌ అధిపతి జనరల్‌ గ్రెగరీ గ్యూలాంట్ పేర్కొన్నారు.

ఈ అంశం పై రష్యా దౌత్య కార్యాలయానికి కూడా ఈ ఘటన పై సమాచారం పంపించారు. ఇటీవల ఎనిమిది రష్యా ఫైటర్‌ జెట్లు, నాలుగు యుద్ధ నౌకలు, రెండు జలాంతర్గాములు అమెరికా భూభాగం దిశగా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బృందంలో రెండు సబ్‌మెరైన్లు ఒక ఫ్రిగెట్‌, ఒక టగ్‌బోట్‌ ఉన్నట్లు అమెరికా తీర భద్రత దళం నాడు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవి సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్ల లోపలికి వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికా ప్రాదేశిక జలాల పరిధికి వెలుపల ఉన్న యూఎస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ లో ఇవి ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. 

Also Read: మిస్టర్ రంగనాథ్‌..అంటూ జడ్జి ప్రశ్నల వర్షం!

Advertisment
Advertisment
తాజా కథనాలు