BIG BREAKING: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

New Update
high court 2

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ తర్వాత  ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. FIR ను క్వాష్ చేయడానికి హైకోర్టు అంగీకరించకపోతే కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఒక వేళ క్వాష్ చేస్తే రేవంత్ సర్కార్ కు ఊహించని ఎదురు దెబ్బ అవుతుంది. మరో వైపు ఫార్ములా-ఈ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓ దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సభ్యులు వాటర్ బాటిళ్లు, పేపర్లు విసిరేసినట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ హెడ్ ఫోన్స్ ను విసిరికొట్టినట్లు సమాచారం.

Also Read: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. ఎంటరైన ఈడీ.. ఏసీబీకి కీలక లేఖ!

Also Read: అరెస్ట్ పై కేటీఆర్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు