మరో ఒకటి లేదా రెండు రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా? లేకపోతే మరో బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ కాబోతున్నారా?.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఔను అనే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి కామెంట్స్ చేసిన నాటి నుంచి అరెస్టుల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణలు జరుగుతున్నాయి. ఇందులో ఏదో అంశంపై చర్యలు ఉంటాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే.. ఈ నెల 26న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్యలకు సంబంధించిన నిర్ణయం వస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
Also Read : నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్
దీపావళికి పొలిటికల్ బాంబులు అన్న పొంగులేటి..
అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి పొంగులేటిని పొలిటికల్ బాంబులు ఎప్పుడు పేలుతాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే.. దీపావళికి ముందే పేలుతాయని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ సన్నిహిత వర్గాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఆ అరెస్ట్ అయ్యే బీఆర్ఎస్ నేత ఎవరు అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పేరు అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. దీంతో.. ఈ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కేటీఆర్ అరెస్ట్ కాకపోతే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్ అవడం ఖాయం అని తెలుస్తోంది.
Also Read : మోమోస్ తిన్న 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఒకరు మృతి
హైదరాబాద్ లో 144 సెక్షన్ అందుకేనా?
హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఈ రోజు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడితే అరెస్ట్ చేస్తామని.. ధర్నాలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్‌లకు నో పర్మీషన్ అని ప్రకటనలో పేర్కొన్నారు సీపీ. కేవలం ఇందిరాపార్క్ దగ్గర మాత్రమే ధర్నాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ 144 సెక్షన్ ను విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : అతిసారను అత్యంత వేగంగా తగ్గించే పండు ఇదే
దీపావళి సమయంలో 144 సెక్షన్ ఏంటని విమర్శలు
మరో వైపు దీపావళి సమయంలో ఈ సెక్షన్ విధించడం ఏంటని పలువురు విమర్శలు గుప్పించారు. దీంతో ఈ అంశంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ ప్రకటనకు దీపావళి వేడుకలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనేక రకాల ఆందోళనలు, సచివాలయం, సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ ముట్టడి, ఆకస్మిక దాడులకు కొందరు ప్లాన్ చేస్తున్నట్లు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే 144 సెక్షన్ ను విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో వైపు హైదరాబాద్ లో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇది కూడా అరెస్టుల నేపథ్యంలోనే అన్న ప్రచారం సాగిస్తోంది.
Also Read : చెప్పింది చేయలేదు.. కానీ రూ.16లక్షలు ఫసక్.. ఎలాగంటే?
జైలుకు వెళ్లేందుకు సిద్ధం:
ఏం పీక్కుంటవో పీక్కో అంటూ మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు కామెంట్లపై కేటీఆర్ గతంలోనే రియాక్ట్ అయ్యారు. కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. జైలుకు వెళ్లడానికి తాము సిద్ధమన్నారు. అన్నింటికీ సిద్ధపడే తాము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చామన్నారు. అరెస్టుల చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.