/rtv/media/media_files/2025/04/27/iGs5qQTARv0JJlsDGQZH.jpg)
BRS Meeting Mallareddy Dance
మాజీ మంత్రి మల్లారెడ్డి అంటేనే ఓ జోష్. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. తాజాగా మరో సారి ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడువు.. నడువు.. నడవవే రామక్క పాటకు ఆయన చేసిన డ్యాన్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఎల్కతుర్తిలో ఈ రోజు జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆలియాబాద్ చౌరస్తా వద్ద మల్లారెడ్డి కార్యకర్తలతో కలిసి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి వారిలో జోష్ నింపారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అలియాబాద్ చౌరస్తా వద్ద స్టెప్పులతో సందడి చేశారు.@chmallareddyMLA #Telangana #Hyderabad #mallareddy #dance #BRSFormationday #RTV pic.twitter.com/KG0WKOo0bh
— RTV (@RTVnewsnetwork) April 27, 2025
(latest-news | telugu-news | telugu breaking news)