BIG BREAKING : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ కన్నుమూశారు.  గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ అనంతరం బీఆర్ఎస్ లో చేరారు.

New Update
Banoth Madanlal

బీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు.  గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ ... అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు మదన్ లాల్. 

Also Read :  నైరుతి రుతుపవనాలు ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Also Read :  దేశంలో భారీ బాంబు పేలుడు

2009లో రాజకీయాల్లోకి 

బానోతు మదన్ లాల్ 1963 మే 03న ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం, ఈర్లపుడి గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు. బానోతు మదన్ లాల్ 2009లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి బానోత్ చంద్రావతి చేతిలో 47 వేల 539 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  

Also Read :  ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

Also Read :  మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..జార్ఖండ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. టాప్ కమాండర్ మృతి

madan-lal | brs-party | khammam

Advertisment
Advertisment
తాజా కథనాలు