మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారన్న చర్చ మరో సారి తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ కావడంతో ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. సీఎంతో భేటీపై మల్లారెడ్డి స్పందించారు. అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయమై సీఎంను కలిశానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. 72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలు వస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. MLAగా కంటే ఎంపీగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. MLA పదవిలో మజా వస్తలేదన్నారు.
(telugu-news | latest-telugu-news | telugu breaking news)
Mallareddy: పార్టీ మార్పుపై నా ఆలోచన ఇదే.. సీఎం రేవంత్ తో భేటీపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయాన్ని చర్చించేందుకే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. 72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతానన్నారు. ఈ సారి ఎంపీగా పోటీ చేస్తానని.. ఎమ్మెల్యేగా మజా వస్తలేదన్నారు.