Harish Rao: తెలంగాణకు కేసీఆర్ జాతిపిత.. రేవంత్ బూతు పిత.. హరీష్ రావు సంచలన ప్రెస్ మీట్!

కేసీఆర్ తెలంగాణకు జాతి పిత అయితే రేవంత్ బూతు పిత అని బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు.

New Update

కేసీఆర్ తెలంగాణకు జాతి పిత అయితే రేవంత్ బూతు పిత అని బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్ రెడ్డికి సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు పోతోందన్నారు. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మళ్లీ సమర్థించుకుంటున్నావని ధ్వజమెత్తారు. సిగ్గుంటే కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మధిరకు పోదామా? కొడంగల్ పోదామా? సిద్దిపేట పోదామా? ఏ ఊరుకు పోదాం? అని రేవంత్ కు సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటే ముక్కు నేలకు రాస్తా,  లేదంటే మీరు రాయండి. ప్రజలకు క్షమాపణ చెప్పండంటూ వ్యాఖ్యానించారు. ఎప్పటిలోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్? అని ప్రశ్నించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు