KTR vs హరీష్... బావాబామ్మర్దుల వార్! TG: కేటీఆర్, హరీష్ రావు నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బండి సంజయ్, అరవింద్.. త్వరలో BRS రెండు వర్గాలుగా చీలుతుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో వేచి చూడాలి. By V.J Reddy 03 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి KTR Vs Harish: బీఆర్‌ఎస్‌లో అగ్రనేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతున్నాయా? కేటీఆర్, హరీశ్‌రావు మాటలు క్యాడర్‌ను కన్‌ప్యూజన్ లోకి నెడుతున్నాయా? సోషల్ మీడియా ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకు ఏం జరిగిందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్‌ఎస్ 100 సీట్లు పక్కాగా గెలుచుకుంటుందని హరీష్ రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఎవరూ అంతం చేయలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌పై పది నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని... ఈసారి ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్లు తీసేది మేమే అని చెప్పారు. ఇది కూడా చదవండి: జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట! విభేదాలు నిజమేనంటున్న బీజేపీ.. మరోవైపు ఇటివల బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపించిన సందర్భంలో బండిసంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు నడుమ పంచాయితీ నడుస్తోందని అన్నారు. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అలాగే కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారని.. బీఆర్‌ఎస్‌లో నెంబర్ 1 స్థానం కోసం బావాబామ్మర్థుల మధ్య పోటీ నెలకొందని ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు! త్వరలో కీలక మార్పులు తప్పవా..? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ పార్టీ భారమంతా కేటీఆర్, హరీశ్‌రావులపైనే వేశారు. ఇద్దరూ అటు అసెంబ్లీతో పాటు ఇటు ప్రజల మధ్య కూడా తమదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో క్లాస్ లీడర్‌గా విద్యావంతులు కేటీఆర్‌ను, మాస్ లీడర్‌గా సామన్యులు హరీశ్‌రావు పట్ల కొంత సానుకూలత కనబరుస్తున్నారు. ఈ దశలో పార్టీ పగ్గాలు ఇద్దరిలో ఎవరికీ ఇవ్వాలి అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కేటీఆర్‌కు పార్టీ పగ్గాలిస్తే హరీశ్‌రావు పార్టీ మారుతారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో త్వరలోనే పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కూడా చదవండి: మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి