/rtv/media/media_files/2025/12/10/fotojet-2025-12-10t081504293-2025-12-10-08-15-37.jpg)
BRS leader brutally murdered
Panchayat Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరి హత్యకు దారి తీసింది.
వివరాల ప్రకారం జిల్లాలోని నూతనకల్ (ఎం) లింగంపల్లిలో సర్పంచ్ ఎన్నిక రక్తసిక్తమైంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను వెంటనే హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.
కాగా సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా ముప్పేట దాడి చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తోపాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దీంతో గ్రామంలో భారీ ఎత్తున మొహరించారు.
ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికి...
కాగా సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ ఎనిమిది మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికల ప్రచార సమయం ముగిసింది. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ నర్సింహ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.అయినా మరో హత్య జరగడం కలకలం రేపింది. మొదటి విడత ఎన్నికల జరగనున్న మండలాల్లో 1500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదు అంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ బూతుల వద్ద, పోలింగ్ లొకేషన్ ల వద్ద, 100 మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధిలో, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎన్నికల నియమావళి అమలు టీమ్స్, రూట్ మొబైల్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు అన్నారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఈ కేంద్రాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. సీసీ కెమెరాలు, కెమెరాలతో ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది అన్నారు.
కాగా మూడు విడతల్లో 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్న ఎస్పీ - గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, రౌడీలు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1284 మందిని ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగిందన్నారు,- 136 కేసుల్లో రూ.9.50 లక్షల విలువైన 1425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం.- 53 లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించామన్నారు. కాగా ఈ మండలాల్లో అదనపు ఎస్పీలు - 2, డిఎస్పీ లు - 8, ఇన్స్పెక్టర్ లు - 15 , సబ్ ఇన్స్పెక్టర్ లు - 50, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు కలిపి 1500 మంది. - ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో, ప్రత్యేక బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ విధుల్లో ఉంటారని తెలిపారు. కాగా ఇంతమంది పోలీసులు గ్రామంలో ఉండగానే హత్య జరగడం సంచలనంగా మారింది.
Follow Us