/rtv/media/media_files/2025/10/13/ram-chander-rao-2025-10-13-20-55-36.jpg)
పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రామ్‌చందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గురించి మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సొంత ఎజెండాతో మాట్లాడొద్దని తెలిపారు. ఇటీవల పార్టీ తీరుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో రామ్‌చందర్ ఈ కామెంట్స్ చేశారు.
మరోవైపు ప్రధానమంత్రి మోదీ సుపరిపాలన, వికసిత్ భారత్ దిశగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారని రామ్‌చందర్ రావు అన్నారు. పార్టీలో చేరిన నాయకులను స్వాగతిస్తూ వారికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్, లండన్ నుంచి ఎన్నారై శశి, వారి బృందం బీజేపీలో చేరడం సంతోషకరమని అన్నారు.అదేవిధంగా దేవరకొండ, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు పార్టీ శ్రేణిలో చేరారని వెల్లడించారు. దేశ అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న బీజేపీ తరపున,ప్రతి కొత్త సభ్యునికి స్వాగతం ఇది న్యాయం, అభివృద్ధి, ప్రజాసేవకు అంకితమైన కుటుంబం అని అన్నారు.
మోదీకి గిఫ్ట్‌గా ఇవ్వాలి
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని రామ్‌చందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని విమర్శి్ంచారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తామని బీఆర్ఎస్ గతంలో చెప్పిందని, కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందని, ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయని ఆరోపించారు. రెండు మూడ్రోజుల్లో క్యాండిడేట్ ను ఫైనల్ చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి అంతా జూబ్లీహిల్స్ లో తిరిగి ప్రచారం చేయాలని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాజకీయ మార్పు చూడాలన్నారు.