Bird Flu: రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..17 వేల కోళ్లు పూడ్చివేత

తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఏపీని వణికించిన బర్డ్ ప్లూ ఇప్పుడు తెలంగాణలోనూ తన ప్రభావాన్నిచూపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధి బాటసింగారం పౌల్ట్రీ ఫామ్‌లో  కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా అధికారులు గుర్తించారు.

New Update
 Bird flu reaches in Telangana

Bird flu reaches in Telangana

Bird Flu: తెలంగాణ(Telangana)లో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. మొన్నటివరకు ఏపీని వణికించిన బర్డ్ ప్లూ ఇప్పుడు తెలంగాణలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగారంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో  కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆ పౌల్ట్రీ సామర్థ్యం 36 వేల కోళ్లు కాగా, ఇప్పటికే వేలాది కోళ్లు మృతి చెందాయి. తాజాగా మరో 17 వేల కోళ్లను పూడ్చేసినట్లు రంగారెడ్డి జిల్లా పశువైద్య, పశు సంవర్థక శాఖ అధికారి డా.బాబు బేరి తెలిపారు. కోళ్ల ఫామ్‌ వద్ద సిబ్బందితో కలిసి మరికొన్ని కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పలు పౌల్ర్టీఫాంల నుంచి శాంపిల్స్‌ ను అధికారులు సేకరిస్తున్నారు. బర్డ్‌ప్లూ అనుమానంతో వేలాది కోళ్లను చంపి గోనే సంచుల్లో కట్టి పూడ్చి పెట్టారు కోళ్లతో పాటు గుడ్లను కూడా మట్టిలో కప్పివేశారు.

మరోవైపు అబ్దుల్లాపూర్ మెట్ లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి, ఎవరైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యశాఖ సర్వేలెన్స్‌ అధికారి డా.అంబిక, అబ్దుల్లాపూర్‌మెట్‌ పీహెచ్‌సీ మెడికల్​ ఆఫీసర్​డా.ప్రసన్న లక్ష్మి వైద్య బృందంతో గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇక అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం,చిట్యాల మండల పరిధిలోని కోళ్ల షెడ్లలోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులకు సమాచారం అందుతోంది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో కోళ్లకు పరీక్షలు జరిపి వైరస్ సోకిన కోళ్లను పూడ్చివేసే పనిలో ఉన్నారు.

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

బర్డ్‌ ఫ్లూ వైరస్‌తో ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇటీవల రెండేళ్ల చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. బర్డ్‌ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. దీంతో బర్డ్ ఫ్లూపై తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు