Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. నామినేషన్‌ వేసిన విష్ణువర్ధన్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నామినేషన్లు వేశాయి. బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతతో పాటు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా నామినేషన్ వేశాడు.

New Update
Vishnuvardhan Reddy files nomination

Vishnuvardhan Reddy files nomination

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నామినేషన్లు వేశాయి. బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. కాగా కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి సునీత(maganti Sunitha) బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్రసమితి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(vishnu-vardhan-reddy) తోనూ నామినేషన్‌ వేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, నామినేషన్‌ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్‌రెడ్డితోనూ భారత రాష్ట్ర సమితి నేతలు నామినేషన్‌ వేయించినట్లు చెబుతున్నారు.

Also Read :  తెలంగాణలోకి హిడ్మా ఎంట్రీ ? ఆయన ప్లాన్‌ అదేనా?

Big Twist In Jubilee Hills By-Election

మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(jubilee hills by-election 2025)లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో ఆ పార్టీ లిస్ట్‌ విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా ఈ లిస్టులో ఉండటం గమనార్హం.  

Also Read :  రోజుకు రెండు ఖర్జూర పండ్లు.. ఎన్నెన్నో ప్రయోజనాలు

Advertisment
తాజా కథనాలు