Raj Pakala: రాజ్ పాకాలపై పోలీసుల విచారణ.. పార్టీలో బిగ్ షాట్స్? జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.దాంతో పాటూ ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసలు కాల్ డేటాపై ఫోస్ పెట్టారు. పార్టీకి బిగ్ షాట్స్ వచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 02 Nov 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Raj Pakala Farm House Case: జన్వాడ ఫామ్ హౌస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో పార్టీ కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అందిన సమాచారం మేరకు రాజ్ పాకాల ఫాంహౌస్‌కి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్నారు. Also Read: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు! ఈ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి వచ్చారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మోకిల పోలీసులు రాజ్ పాకాలను దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. Also Read: నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం! పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో ఇప్పుడు రాజ్‌పాకాల ఫోన్ కీలకంగా మారింది. ఆయన పార్టీకి ఎవరెవరిని ఆహ్వానించారు.. ఎవరెవరు పార్టీకి వచ్చారు. అలాగే విదేశీ మద్యం ఎక్కడినుంచి తెప్పించారు. ఆయన స్నేహితుడు విజయ్ మద్దూరికి కొకైన్ ఎక్కడినుంచి వచ్చింది. రాజ్ పాకాల ఇచ్చారా? లేక ఆయనే తెచ్చుకున్నాడా? ఆయనతో పాటు మరేవరైన డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయాలు సేకరిస్తున్నారు. Also Read: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు పార్టీలో కీలక వ్యక్తులు.. రాజ్ పాకాల మొబైల్ స్వాధీనం చేసుకున్న పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆయన కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఫామ్‌హౌస్ పార్టీకి పలువురు కీలక వ్యక్తులు హాజరైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారంతా రైడ్ సమయంలో ఎటువెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కాల్ డేటా ఆధారంగా పలువురిని విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ మద్దూరికి డ్రగ్స్ ఇచ్చింది రాజ్ పాకాల నేనా..? అయితే ఎక్కడి నుంచి వాటిని కొనుగోలు చేసారన్న అంశంపైనా కూపీ లాగుతున్నారు. త్వరలో దీనికి సంబంధించి కీలక సమాచారం బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది. Also Read: TS: కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు? #rtv #raj pakala arrest #ktr #Raj Pakala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి