ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ ను ప్రేమిస్తారని.. వారు అక్కడికే వెళ్లిపోవాలంటూ కామెంట్ చేశారు. దీనికి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్ చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి:
— RTV (@RTVnewsnetwork) April 29, 2025
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు. ప్రజలు గమనించాలి.
ప్రజలు ఉప ముఖ్యమంత్రి చేసినపుడు నాయకుడు అనేవాడు ఆలోచించి మాట్లాడాలి.
కాంగ్రెస్… pic.twitter.com/AUBtbc9pY4
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ..
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని.. భారతదేశాన్ని కాపాడే పార్టీ అని అన్నారు. నరేందర్ మోదీని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే రాజకీయాలు మానేసి, రెండు సినిమాలు తీయాలని ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయొద్దని సూచించారు. మీ నాయకుని లెక్క కుల మతాల మధ్య తాము చిచ్చు పెట్టట్లేదన్నారు. నలుగురు ముష్కరులు 28 మందిని చంపితే వారం రోజుల నుండి ఎందుకు అరెస్ట్ చేయలేదో మోదీని ప్రశ్నించాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఇంటెలిజెన్స్ వైపల్యమా? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
( chamala kiran kumar | Pawan Kalyan | telugu-news | telugu breaking news)
Follow Us