Bhadrachalam : భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యుల పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆయనపై ఆలయ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. తన కోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీలోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కోడలు కేసు పెట్టింది.
అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియకుండా దాచిపెట్టినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 14న తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆలయ అర్చకుడి కోడలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. గతకొంతకాలంగా తన మామే లైంగిక దాడికి పాల్పడుతున్నారని, అత్త తోపాటు,భర్త, ఆడపడుచులు కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురిచేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రూ.10 లక్షల కట్నం కోసం వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఏపీలో కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణలో చర్యలు తీసుకున్నారు. భద్రాది ఆలయ ప్రధాన అర్చకుడితోపాటు ఆయన దత్తపుత్రుడిని తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు వారి పై సస్పెన్షన్ వేటు వేశారు. కేసు నమోదైన క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పోలికతోనే ఓ వారసుడిని ఇవ్వాలని కోడలిపై వేధింపులు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు లో తెలిపింది.
దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ మేరకు భద్రాది ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులతో పాటు దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడు పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు.
అయితే ఈ విషయం గురించి స్పందించిన ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యలు తమ కుటుంబంలోని కలహాలను అనుకూలంగా చేసుకొని దేవాదాయ శాఖ కార్యనిర్వాహక విభాగం తనను మానసిక వేదనకు గురిచేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. సీతారామానుజాచార్యులు ఆలయ మాడ వీధుల విస్తరణలో భాగంగా దేవస్థానం ఆలయాన్ని ఆనుకుని ఉన్న తన ఇంటిని కూల్చివేయాలని యత్నిస్తోందని ఆరోపిస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు అందకు తాను ఒప్పుకోకపోవడంతోనే లేని పోని అభాండాలను వేస్తూ బాధ్యతల నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.
తన భార్య వేరు కాపూరం పెట్టాలని ఒత్తిడి చేస్తోందని అందుకు ఒప్పుకోకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యి కేసుల వరకు వెళ్లాయని అర్చకుడు సీతారాం చెబుతున్నాడు.
Also Read: Nagababu: జానీ మాస్టర్ నిర్దోషి!.. నాగబాబు సంచలన ట్వీట్!