Momos case: కల్తీ మోమోస్ తయారు చేసిన గ్యాంగ్ అరెస్ట్.. ఎంతమంది అంటే?

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ చనిపోయింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించిన పోలీసులు బీహార్‌కి చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
Momos case

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నిందితులను తాజాగా అరెస్టు చేశారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

అనంతరం అక్కడికి చేరుకుని బీహార్‌కి చెందిన దాదాపు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆపై నిందితులు మోమోస్ తయారు చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అపరిశుభ్రత, నాసిరకం పదార్థాలతో వాటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆపై మమోస్, మయోనైస్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.

Also Read: కత్తులతో నరికి ఎలా చంపారంటే?.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి !

అసలేం జరిగింది

బంజారాహిల్స్‌లోని నందినగర్‌, సింగాడకుంట బస్తీకి చెందిన శంకర్ కాలనీలో సంత జరిగింది. స్థానిక సింగాడకుంట బస్తీకి చెందిన కొందరు ఆ సంతలో మోమోస్ తిన్నారు. ఇక అదే రోజు రాత్రి నుంచి వారు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పలు హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 

Also Read:  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

అందులో రేష్మ బేగం (31) అనే మహిళ పరిస్థితి విషమించడంతో మరణించింది. ఇక అస్వస్థతకు గురైన ఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మోమోస్ అమ్మిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 

షవర్మ తిని పలువురికి అస్వస్థత

ఇలాంటి ఘటనే ఇటీవల మరొకటి జరిగింది. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో షవర్మా తిని ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. కొందరు వాంతులు, కొందరు విరేచనాలు కావడంతో హాస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మరోచోట సైతం ఇలాంటి ఘటనే జరిగింది.

Also Read:  అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

అలాంటిదే అల్వాల్‌‌లోని ఓ హోటల్‌లో జరిగింది. షవర్మా తిన్న కొందరు అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చేరారు. వారు తిన్న ఆహారంలో ప్రమాదరకర బ్యాక్టీరియా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. షవర్మ తినేందుకు వినియోగించే మయోనైజ్‌ కలుషితం కావడం, నాసిరకంగా ఉండటంతో తిన్నవారు అస్వస్థతకు లోనయ్యారని గుర్తించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు