నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. సభకు రాకున్నా KCRకు షాక్!

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు (ఆగస్ట్ 30) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. ఈ సెషన్ మూడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.

New Update
TS Assembly

TS Assembly

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటి(ఆగస్ట్ 30) నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు శనివారం ఉదయం 10.30 గంటలకు మొదలవ్వనున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. ఈ సెషన్ మూడు నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఇందులో అధికార, ప్రతిపక్షల మధ్య వాడివేడి ప్రసంగాలు చేటుచేసుకోనున్నాయి. అసెంబ్లీలో రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టనున్నారు. కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించి.. సభ్యుల అభిప్రాయాలు తీసుకుని చర్యలకు సిద్ధమైయారు. కాళేశ్వర కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌తో గత ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల, యూరియా కొరత గురించి కూడా చర్చించనున్నారు. ఈ సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అసెంబ్లీ నేపథ్యంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేత కేసీఆర్ నేత ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో కేసీఆర్‌ ఎంట్రీ కోసం BRS శ్రేణుల ఎదురుస్తున్నారు. KCR సభకు రాకున్నా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పడే విధంగా ఉంది.  

కీలక అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ వివరాలు ఉన్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచే అంశంపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది.
వర్షాలు, యూరియా కొరత: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం, అలాగే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత వంటి అంశాలపై కూడా సభలో చర్చించే అవకాశం ఉంది.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక: ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు