Anjan Kumar Yadav : కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది వాళ్లే..కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు.

New Update
Anjan-Kumar-yadav

Anjan-Kumar-yadav

Anjan Kumar Yadav : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శతవిధాల ప్రయత్నించారని ఆరోపించారు. తనను కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది కూడా వీళ్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం హైదరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి బీహార్ మాజీ సీఎం లూలూ ప్రసాద్ యాదవ్ చెప్పినందుకే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్!

ఇక ఎన్నికల్లో ఓడిపోయే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే టైంలో మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా ఎలా పోటీ చేస్తారని అడిగారన్నారు. మరి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఒడిపోయాడని.. ఆయనకు ఎంపీగా మళ్లీ టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పక్క పార్టీలోని దానం నాగేందర్‌ను తీసుకు వచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భజన సంఘాలు వచ్చాయని వ్యంగ్యంగా పేర్కొన్నారు. తమకు ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ సారథ్యంలోని పార్టీలోని కీలక నేతలను అంజన్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: పులివెందుల ప్రజలకు జగన్ గుడ్ న్యూస్.. ఎల్లుండే ప్రారంభోత్సవం!

 లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినందుకే తెలంగాణలో రేవంత్‌ సర్కార్ కుల గణన సర్వే నిర్వహించిందని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. లేకుంటే వీళ్లు ఈ సర్వేనే చేసే వారు కాదని ఆయన స్పష్టం చేశారు.   

Also Read :  అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!

Also Read: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు