Maoist Leader Hidma: లొంగుబాటలో మరో మావోయిస్టు నేత....అప్రమత్తమైన నిఘావర్గాలు

వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో మరో అగ్రనేత మడావి హిడుమాయ్‌ అలియాస్‌ హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆయుధాలతో పాటు లొంగిపోతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

New Update
Madvi Hidma

Maoist Leader Hidma

Maoist Leader Hidma :  వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బస్వారాజ్‌ అలీయాస్‌ దాదా) ఎన్‌ కౌంటర్‌ తర్వాత ఆ పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్న లతో పాటు 300లకు పైగా మావోయిస్టులు లొంగిపోవడంతో పార్టీపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు నాయకుల్లో మరో అగ్రనేత మడావి హిడుమాయ్‌ అలియాస్‌ హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆయుధాలతో పాటు లొంగిపోతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
 
హిడ్మా లొంగుబాటు ప్రచారాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఖండిస్తున్నప్పటికీ.. హిడ్మా తెలంగాణలో లొంగిపోయే అవకాశాలను తోసిపుచ్చలేమని నిఘా వర్గాలు అంటున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ప్లాటూన్‌-1 కమాండర్‌గా ఉన్న హిడ్మాకు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుంది. సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూల్లో చదివి చిన్నవయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు.. ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుదిదశకు చేరుకున్నట్లేనని కేంద్రం భావిస్తోంది. భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల వెనుక హిడ్మా కీరోల్‌గా భావిస్తారు.

ఛత్తీస్‌గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా.. మల్లా, నిషాద్‌ వర్గాలకు చెందిన వందలాది మంది గిరిజనులను మావోయిస్టు పార్టీలో చేర్పించారని చెబుతారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పీఎల్‌జీఏలో చేర్చి... అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారని నిఘావర్గాలు చెబుతున్నాయి. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిడ్మా.. చాలా సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. అగ్రనేతలు సోనూ, ఆశన్నతోపాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత హిడ్మా లొంగుబాటు విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?

Advertisment
తాజా కథనాలు