/rtv/media/media_files/2025/06/29/amit-shah-2025-06-29-16-55-59.jpg)
Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల పసుపు రైతలు కలను ప్రధాని మోదీ నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. '' పసుపు బోర్డును నా చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను.
Also Read: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు
Amit Shah Inaugurates Turmeric Board National Headquarters
తెలంగాణకు పసుపు బోర్డు తీసుకొచ్చేందుకు బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు. ఇప్పుడు తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాదు.. దీనికి ఛైర్మన్‌గా కూడా తెలంగాణకు చెందిన వ్యక్తినే నియమించాం. ప్రపంచవ్యాప్తంగా నిజామాబాద్ పసుపు పంటకు ఎంతో జనాధారణ ఉంది. పసుపు అనేది ఒక దివ్యమైన ఔషధం. యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియాగా ఇది పనిచేస్తుంది. ఒక బిలియన్ డాలర్ విలువైన పసుపును 2023 నాటికి మనం విదేశాలకు ఎగుమతి చేయాలి.
Also Read: జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి, 50 మందికి పైగా..
Also Read : చెవులను శుభ్రం చేస్తే ఇయర్‌బడ్స్‌తో ప్రమాదమా..? నిపుణులు చెప్పిన షాకింగ్ విషయాలు
ఈ పసుపు బోర్టు ద్వారా రైతులకు కొత్త సాగు పద్ధతులపై ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడి పసుపు పంటికి జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం. భారత్ కో ఆపరేటివ్ సొసైటీ నుంచి రైతులకు మేలు చేయాలని మేము కృషి చేస్తున్నామని'' అమిత్ షా అన్నారు. ఇదిలాఉండగా ఈ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీలు ధర్మపురి అర్వింద్, కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. పసుపు బోర్డు ఛైర్మన్ అయిన గంగారెడ్డి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
Also read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు