రాష్ట్రవ్యాప్తంగా లేడీ అఘోరీ వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ లేడీ అఘోరీ తల్లిదండ్రులను RTV తాజాగా కలిసింది. ఇందులో భాగంగానే అఘోరీగా ఎందుకు మారాడన్న దానిపై సమాచారాన్ని సేకరించింది. అఘోరీగా ఎప్పుడు మారాడు, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు, అఘోరీ తల్లిదండ్రులెవరు, వారి గ్రామం ఎక్కడ? అనే విషయాలు RTV వెల్లడించింది.
ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
20 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయాడు
మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం కుషన్‌పల్లికి చెందిన చిన్నయ్య, చిన్నక్క దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అందులో నలుగురు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల. వారిలో అఘోరీగా మారిన ట్రాన్స్‌జెండర్ 3వ కుమారుడు. అతడి అసలు పేరు శ్రీనివాస్. 20 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయాడని అఘోరీగా మారిన శ్రీనివాస్ తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా వెళ్లిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా, ఆపై అఘోరాగా మారినట్లు వారు చెప్పారు.
ఇది కూడా చదవండి: రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?
అయితే ఐదేళ్ల కిందట శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆశ్వీరాదం తీసుకున్నట్లు వారు తెలిపారు. శ్రీనివాస్ కు సంబంధించిన వివరాలు తెలిపిన అనంతరం RTV ద్వారా తమ కొడుకుతో మాట్లాడారు. మాట్లాడుతుండగా అఘోరీ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెడుతూ ఇంటికి ఎప్పుడు వస్తావని అఘోరీని అడిగారు. దీంతో అఘోరీ మాట్లాడుతూ.. 'నేను మీ దగ్గరికి రాలేను. నా ప్రాణమైనా పోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి' అని అఘోరీ తన తల్లిదండ్రులకు సూచించింది.
Also Read: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!
కాగా ఇటీవల సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి గుడిలో ఈ లేడీ అఘోరీ నగ్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం అందరికీ తెలిసింది. ఒంటిపై నూలు పోగులేకుండా నగ్నంగా ఉన్న అఘోరీ రూపాన్ని చూసి గుడిలో ఉన్న భక్తులంతా ఖంగుతిన్నారు. శరీరం మొత్తం తెల్లటి విభూతిదో కనిపించడంతో సాక్షాత్తు అమ్మవారే వచ్చారని మహిళా అఘోరిపై పసుపు నీళ్లు చళ్లారు.
Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అనంతరం ఆ మహిళా అఘోరీ హోమంలో పాల్గొని ఒంటి కాలిపై నిలబడి పూజాలు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది.