/rtv/media/media_files/2025/04/24/bseCqkgQKkFCKhuJBrGJ.jpg)
Aghori in prison
Aghori : అఘోరీ, వర్షిణీ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ఒక మహిళా నిర్మాతను మోసం చేసిన విషయంలో అఘోరీ శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కంది సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే, కంది సబ్ జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు, కేకలతో హంగామా చేశాడు. వర్షిణిని నా దగ్గరే ఉంచాలి.. అంటూ గట్టిగా అరుస్తూ జైలులో వీరంగం సృష్టించాడు. అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్‌ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్ జెండర్ గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో, పోలీసులు శ్రీనివాస్‌ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది సబ్‌జైలుకు తరలించారు. అంతకు ముందు అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలో తేల్చుకోలేక కంది జైలు అధికారులు తలలు పట్టుకున్నారు. చేసేది లేక తిరిగి పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!
మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్‌లో ఉంచాలా.. లేక పురుష ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. వైద్యుల పరీక్షల్లో అఘోరీ ట్రాన్స్‌జెండర్ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఘోరీ భార్య శ్రీవర్షిణీ తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్‌షాకోట్‌లో గల కస్తూర్బా గాంధీ హోంకు తరలించారు. అయితే తన భార్య శ్రీవర్శిని తనతోపాటే జైలులో ఉండాలని, వర్షిణీ లేకుంగా తను ఉండలేనంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తమ ఇద్దరిని కలిపి ఒకే బ్యారక్‌లో ఉంచాలని అఘోరీ రచ్చరచ్చ చేయడం తో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.అయితే ఆ తర్వాత తనతో పాటు తన భార్య విచారణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!
Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్
chanchalguda-jail | Agori comments | Varshini Marriage With Aghori | varshini lady aghori comments