తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 నుంచి నిర్వహించే ప్రజాపాలన గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మండల ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39,748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700మంది సిబ్బందిని కేటాయించారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలన్నది ప్ఱభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ నెల 29 న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడ దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు.
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లు మగాళ్లకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందని, దీనిపై త్వరలోనే ఆర్టీసీ అధికారులనుంచి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.