/rtv/media/media_files/2024/12/01/yjd0R7beusV7bzVONJtt.jpg)
Acb Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
Also Read: AAP: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష
ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫాంహౌస్ లతో పాటు భారీగా వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు.కేజీల కొద్ది బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తుల మార్కెట్ విలువ ప్రకారం..దాదాపు రూ. 150 కోట్లకు పైనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం... దాదాపు రూ. 150 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Pak: హైబ్రిడ్ మోడల్‌కు పాక్ గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండిషన్.. ఏంటంటే?
సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ దరఖాస్తు దారుడిని అధికారులు రూ. 2.50 లక్షలు లంచం అడిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలంయంలో 6 నెలల క్రితం ఏసీబీ సోదాలు జరిగాయి.లంచం తీసుకుంటూ ఈఈ బన్సీలాల్ , ఏఈ నిఖేశ్ ,కార్తీక్ ఏసీబీకీ చిక్కారు. ప్రస్తుతం నిఖేశ్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నారు.
Also Read: Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు
ఈ క్రమంలో సోదాలు ముగిసిన తరువాత అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ..నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. న్యాయమూర్తి నివాసం లో హాజరుపర్చారు. నిఖేశ్ కుమార్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ని చంచల్ గూడ జైలు కు తరలించారు.