రామ రామ.. రాముడి పేరుతో భక్తులకు పంగనామం!

పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి దేవస్థానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. సీతారాముల కళ్యాణం టికెట్లు, ఆలయ చందాల పేరుతో నకిలీ రశీదులు, బుక్కులు ముద్రించి ఈవో సంతకాలు ఫోర్జరీ చేశాడు. వాటిని భక్తులకు అమ్ముకుని డబ్బులు బాగానే దండుకున్నాడు.

New Update
lord-rama cheating

lord-rama cheating

తప్పులు చేసి దేవుడా పలానా తప్పు చేశా క్షమించు తండ్రి అంటూ రెండు చేతులు జోడించి  క్షమాపణలు వేడుకోవడం మనుషుల నైజం.  కానీ ఇక్కడకో వ్యక్తి ఏకంగా దేవుడి పేరు మీదే తప్పులు చేశాడు. దేవుడి పేరుతో భక్తులకు పంగనామం పెట్టాడు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మిడి దేవస్థానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు.  సీతారాముల కళ్యాణం టికెట్లు, ఆలయ చందాల పేరుతో నకిలీ రశీదులు, బుక్కులు ముద్రించి ఈవో, దేవస్థానం అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడు. వాటిని భక్తులకు అమ్ముకుని డబ్బులు బాగానే దండుకున్నాడు.  అయితే ఈ విషయం కాస్త దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. గతంలో దేవాలయ ధర్మకర్తగా పని చేసిన రవి అనే వ్యక్తి ఈ వసూళ్లకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.  దీంతో రవిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు.  

హైదరాబాద్లో వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. 2025 ఏప్రిల్ 06వ తేదీ ఆదివారం రోజున శ్రీరామనవమి సందర్భంగా  వైన్ షాపులు బంద్ చేయాలని రాచకోండ పోలీస్ కమిషనర్ రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని పరిధిలోకి కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

Advertisment
తాజా కథనాలు