/rtv/media/media_files/2026/02/20/fotojet-22-2026-02-20-17-01-34.jpg)
A major terror plot has been foiled in Hyderabad.
Major terror plot foiled in Hyderabad: గతంలో ఒకసారి హైదరాబాద్ లో ఉగ్రదాడులకు యత్నించిన లష్కర్ ఈ తోయిబా తీవ్రవాదులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నిందితులు ముగ్గురు మరోసారి నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారన్న వార్త కలకలం రేపింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారని, దీనిపై అలర్ట్ అయిన పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై గట్టి నిఘాపెట్టారని ప్రచారం సాగుతోంది.
#Hyderabad
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 21, 2026
చంచల్‌గూడ జైలులో ఉగ్రకుట్ర జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ డి. శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. pic.twitter.com/0uYxVjmGfu
ఎమ్మెల్సీ అనంతబాబు.. గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో జరిగిన ఈ ఘటన మళ్లీ ఇప్పుడు ఎందుకు రాజుకుంది...జనాల దృష్టిలో నాడు క్లోజ్ అయిన ఈ ఫైల్...నేడు మళ్లీ ఎందుకు తెరుచుకుంది..ఈ వివరాల్లోకి వెళ్లేముందు అసలు అనంతబాబు ఎవరు...అతని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఏంటన్నదానిపై ఇప్పుడోసారి నిశితంగా చూద్దాం...
47 ఏళ్ల అనంతబాబు.. తక్కువ టైమ్‌లోనే ఎమ్మెల్సీ స్థాయికి చేరుకున్నాడు. దానికంటే ముందు డీసీసీబీ ఛైర్మన్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగాడు. మారేడుమిల్లి అడవుల్లో.. రంపచోడవరం ఏజెన్సీలో తెలుగు వీరప్పన్ గా ముద్రపడ్డాడు. అయితే ఇదంతా గతం. మన్యంలో ఉండి అతను ఏం చేసినా..ఎంతగా చెలరేగిపోయినా..ఎన్ని అరాచకాలు చేసినా అది కొండకోనల్లో కాబట్టి అతడికి సాగిపోయింది. కానీ అడవిని దాటి మైదానంలో చేసిన హత్య ఇప్పుడు అనంతబాబు జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే...అనంతబాబు రాజకీయ సమాధికి ఈ హత్య నిలువెత్తు సాక్ష్యమనే చెప్పుకోవచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో సెక్షన్ 302 కింద అరెస్ట్ అయిన తొలి ఎమ్మెల్సీ గా రికార్డులకెక్కాడు అనంతబాబు.
అనంతబాబు తండ్రి అనంత చక్రరావు అడ్డతీగల సమితి అధ్యక్షుడిగా చేశాడు. అమాయక గిరిజనులే చక్రరావు టార్గెట్. వాళ్లని బానిసలుగా చేసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ఆదివాసీ భూములను కబ్జా చేశాడు.. ఇతని అరాచకాలపై గురిపెట్టిన నక్సల్స్ 1986లో చక్రరావును కాల్చి చంపారు.
తన తండ్రి ఆదివాసీ అని అనంతబాబు చెప్పుకుంటాడు. కానీ కాపు కులానికి చెందిన మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ సోదరిని…చక్రరావు వివాహం చేసుకున్నాడు. అయితే తల్లి కాపు అయినప్పటికీ తండ్రి కులమే తనదనేది అనంతబాబు వాదన. అందుకే అనంతబాబు ST అభ్యర్థిగా జెడ్పీటీసీకి ఎన్నికయ్యారు. ఇది కూడా అప్పట్లో వివాదాస్పదమయింది.. అటు మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే..ఇటు జ్యోతుల నెహ్రూ అటు వరుపుల సుబ్బారావుకు ముద్దుల మేనల్లుడు అనంతబాబనే టాక్ ఉంది. నాడు టీడీపీలో కొనసాగిన అనంతబాబు కాలక్రమేనా జగన్ చెంతన చేరాడు.
తండ్రి వారసత్వంగా రంపచోడవరం,అడ్డతీగల ప్రాంతాలను అడ్డాగా చేసుకున్న అనంతబాబు ఫొటో, బ్యానర్లేని ఏజెన్సీ గ్రామం అంటూ ఉండదు. అక్కడ గిరిజన కుర్రకారు ఫోన్లలో సైతం అనంతబాబు ఫొటోనే స్క్రీన్ సేవర్‌గా ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఏజెన్సీలో చాలామంది యువతకు స్పోర్ట్స్ కిట్స్ అనంతబాబు ఉచితంగా పంపిణీ చేయడమే దీనికి కారణమంటారు అతని కహానీ పూర్తిగా తెలిసినవాళ్లు. ఏజెన్సీలో జరిగే సంతల్లో, బొంగు చికెన్ అమ్మే షాపుల ముందు అతని బ్యానర్ ఉండాల్సిందే. నాడు రాజకీయంగా ఏ పోస్టులోనూ లేకపోయినా మన్యంలో అనంతబాబు క్రేజ్ అలాంటిది మరి. ఇక, ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయాక కలప స్మగ్లింగ్‌తో తెలుగు వీరప్పన్‌గా అవతారమెత్తాడు అనంతబాబు. అటవీ ఉత్పత్తుల ఎగుమతులు, రంగురాళ్ల వ్యాపారం ఇలా ఒకటేంటి... అడవిలో దొరికే అన్ని వస్తువలకు ఆయనే ఓనర్..ఆయనే జమీందార్..
ఆయనపై రౌడీషీట్ నమోదైతే నాడు తన అధికారపార్టీ వైసీపీ హయాంలో ఎత్తేయించుకున్నాడనే ఆరోపణలూ ఉన్నాయి. అనంతబాబు పొలిటికల్ కెరీర్లో ఇదంతా నాణేనికి ఒకవైపుగా చూడొచ్చు.
అయితే 2022, మేలో సొంత డ్రైవర్‌ను చంపేసిన కేసు అటు అనంతబాబునే కాదు ఇటు వైసీపీని కూడా చిక్కుల్లో పడేసేలా చేసింది. ఎమ్మెల్సీ రహస్యాలు తెలిసే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అనంతబాబు చంపేశాడని ఆరోపణలు ఉన్నా..వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనే హత్యచేశానంటూ నాడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాను ఒక్కడినే డ్రైవర్‌ను చంపానని చెప్పిన అనంతబాబు వాంగ్మూలం అబద్ధమని తేలింది.
కేసు పునర్విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన ప్రస్తుత కూటమి సర్కార్...భర్త అనంతబాబు దారుణంలో భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉందని తేల్చింది. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా లక్ష్మీదుర్గను ఏ-2గా చేర్చారు పోలీసులు. అంతేకాదు విచారణ నిమిత్తం రావాలని ఆమెకు నోటీసులు జారీచేయడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్పిటిషన్ దాఖలు చేసి పరారీ అయిపోయారు. కాగా, ఓ వైపు మండలి సమావేశం జరుగుతుండగా ఉన్నపళంగా ఫోన్లు స్విచాఫ్ చేసి, కనీసం గన్మన్లకు కూడా చెప్పకుండా అనంతబాబు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జైల్లో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలతో హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చంచల్‌గూడ జైలు ములాఖత్ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పలు అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ నిఘా పెంచినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా మూసారాంబాగ్, మలక్‌పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. చంచల్ గూడ జైల్లో ఉన్న లష్కర్ ఉగ్రవాదితో ములాఖత్ అయ్యేందుకు వచ్చిన ఆయన భార్యతో ఆ టెర్రరిస్ట్ ఉగ్రదాడుల గురించి సంభాషించినట్లు సమాచారం. తన భార్య ద్వారా జైలు నుంచి ఉగ్ర సమాచారాన్ని చేరవేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ వద్ద ఆలయాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారీ ఎత్తున ఐఈడీ పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన తెలిసిందే. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 20మంది గాయపడ్డారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.. ఈ క్రమంలోనే.. మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలటంతో కలకలం రేపుతోంది.
వదందులను నమ్మొద్దు
అయితే చంచల్‌గూడ జైలులో ఉగ్రకుట్ర జరుగుతోందంటూ వస్తున్న వార్తలను జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం వదంతులేనని ఆయన కొట్టిపారేయడం గమనార్హం. చంచల్‌గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులకు సంబంధించిన వ్యక్తులు 'ములాఖత్' నిర్వహించి నగరంలో దాడులకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన డీఐజీ.. అటువంటి సంఘటనలు ఏవీ జరగలేదని స్పష్టత నిచ్చారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలను ప్రసారం చేసేటప్పుడు బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కనీస ధృవీకరణ చేసుకోవాలని ఆయన కోరారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భయాందోళనలు సృష్టించవద్దని ఆయన విజ్క్షప్తి చేశారు. అలాగే ఈ వార్తలను జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖండించారు. ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ అసత్య వార్తలను కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారని, ప్రజలను ఇలాంటి వార్తలతో భయాందోళనలకు గురిచేయవద్దని ఆమె కోరారు.
Follow Us