/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
A curtain for propaganda... a lure with temptations
Panchayat Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా అభ్యర్థులు చివరి నిమిషంలో డబ్బులు, మద్యం పంపకాలకు సిద్ధమయ్యారు. ఖమ్మం జల్లా వ్యాప్తంగా ప్రలోభాల పర్వం బహిరంగంగా కొనసాగుతోంది. హస్తం పార్టీ ఓటరకు రూ.1000 ఇస్తే, కారు పార్టీ ఒటుకు రూ.500 చొప్పున ఇవ్వడానికి సిద్ధమైంది. దీంతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నోట్లపంపిణీకి అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచే నోట్లపంపిణీతో ఓటర్లకు వల వేస్తున్నారు. భధ్రాచలంలో ఇంటింటికీ ఓటుకు నోటు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యి నుంచి 1500 పంచుతున్నారు. కారుపార్టీ అభ్యర్థులు 500 నుంచి 1000 రూపాయలు పంచుతున్నారు. ఇంటింటికీ కేజీ చికెన్ పంచి ఓటర్లను ప్రసన్నంచేసేందుకు అభ్యర్థుల కుస్తీలు పడుతున్నారు. మరో వైపు గ్రామాల్లో మద్యం ఏరులైపారుతుంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికే 12వందలలీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సర్పంచ్ స్థానాల కోసం బీఒర్ఎస్, కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. పొత్తులు, ఎత్తులతో స్థానిక బలాన్ని విస్తృతం చేసే దిశగా కమ్యూనిస్టు పార్టీలున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఉనికిచాటుకునేందుకు బీజేపీ పోరుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 317 సర్పంచ్ స్థానాల కోసం పోటీపడుతున్న 937 మంది అభ్యర్థులు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే తొలివిడత 159 సర్పంచ్ స్థానాలకు 14 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 141 సర్పంచ్ స్థానాల్లో 461 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో తొలివిడత ఎన్నికలకు 1428 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లాలో 192 సర్పంచ్ స్థానాలకు 20 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 172 సర్పంచ్ స్థానాల్లో 488 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం ఏడుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనున్న పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.. అదేరోజు మధ్యాహ్నం రెండుగంటల నుంచి ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగతుంది. సాయంత్రం ఫలితాల వెల్లడిస్తారు. ప్రతి రెండుగంటలకోసారి పోలింగ్ శాతాన్ని టీపోల్ యాప్ లో అధికారులు నమోదు చేయనున్నారు. పోలింగ్ సజావుగా సాగేలా వేల సంఖ్యలో పోలీసు బలగాల మోహరించారు.సమస్యాత్మక కేంద్రాల్లో సాయుధ బలగాల మోహరించినట్లు అధికారులు తెలిపారు.
Follow Us