Indiramma houses: కొంప ముంచిన కారు..ఇందిరమ్మ ఇంటికి నో ఛాన్స్‌

ఉపాధి కోసం కొనుక్కున్న కారు సొంతింటి కళ నెరవేరేవేళ అడ్డుగా నిలుస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం ద్వారా కారు కొనుక్కుని క్యాబ్‌ డ్రైవర్‌గా ఉపాధి పొందడమే కారణమైంది. కారు ఉందన్న కారణంతో చాలామందికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం నిలిపివేశారు.

New Update
FotoJet - 2026-01-21T123134.894

A car submerged in mud...no chance for Indiramma's house

Indiramma houses: ఉపాధి కోసం కొనుక్కున్న కారు సొంతింటి కళ నెరవేరేవేళ అడ్డుగా నిలుస్తోంది.  గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకం ద్వారా కారు కొనుక్కుని క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనోపాధి పొందడమే దానికి కారణమైంది. సొంతిల్లు లేని నిరుపేద కుటుంబమే అయినప్పటికీ కారు ఉందన్న కారణంతో చాలామందికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత లేకుండా పోయింది. ప్రయాణ అవసరాలకు కారు కొనుక్కోవడం, ఉపాధి కోసం క్యాబ్‌ నడుపుకోవడం ఒకటే అనే రీతిలో అధికారులు వ్యవహరించడం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించేటప్పుడు అర్హతలు, అనర్హతల విషయంలో పేర్కొన్న అంశాల విషయంలో లోతుగా అధ్యయనం చేయకపోవటం వల ఈ గందరగోళం చెలరేగింది. ఇందులో క్యాబ్‌ డ్రైవర్ల విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్యాబ్‌ సేవలు అత్యంత కీలకంగా మారాయి. వేలాది మందికి ఉపాధిగా మారింది. ఉన్న ఊళ్లో పూట గడవటం కష్టంగా మారిన చాలామంది దీనివైపు మొగ్గుచూపుతున్నారు. గత ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయాన్ని అందజేసిన సమయంలో వేలాది మంది దళిత యువకులు క్యాబ్‌ కోసం కార్లు కొనుక్కున్నారు. అప్పట్లో ఈ పథకానికి నిరుపేదలుగా అర్హత పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వచ్చేసరికి ‘అనర్హులు’గా మారిపోవడం చర్చనీయంశంగా మారింది.

Also Read: అయ్యో..పిజ్జా హట్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..అసలేం జరిగిందంటే..

ఆ నిభందనే అడ్డంకి 
ఇందిరమ్మ పథకం లబ్ధి పొందే అర్హత జాబితాలో సొంత కారు ఉండకూడదన్న నిబంధన ఒకటి ఉంది. కారు కొనే ఆర్థిక స్తోమత ఉంటే నిరుపేదలు కాదన్న ఉద్దేశంతో దీన్ని చేర్చారు. దీంతో జీవనోపాధి కోసం క్యాబ్‌ కారు ఉన్న వారిని కూడా సొంతకారు ఉందన్న జాబితాలో చేరిపోయారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉండటంతో వారు అనర్హులుగా మిగిలిపోయారు. దీంతో ఇప్పుడు వేలాది మంది సొంత క్యాబ్‌ డ్రైవర్లు ఇళ్లు లేకలబోదిబో మంటున్నారు. సొంత కారైనా, క్యాబ్‌ కారైనా... కారు ఉంటే ఇందిరమ్మ ఇంటికి అర్హత రాదు అని ముందే స్పష్టం చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఈ విషయాన్ని ముందు ఎవరు  చెప్పలేదు. దీంతో క్యాబ్‌ డ్రైవర్లుగా పనిచేస్తున్న వేల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేశారు.

Also Read: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఇకమీదట అకౌంట్ లోకే జీతాలు

క్షేత్రస్థాయి పరిశీలనలో, క్యాబ్‌ డ్రైవర్ల పేదరికాన్ని పరిశీలించి సిబ్బంది వారిలో చాలామందిని అర్హులుగా తేల్చారు. దీంతో, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఇంటి ఆర్థిక సాయం డబ్బులు చెల్లించేప్పుడు ఆధార్‌కార్డు ఆధారంగా వెరిఫికేషన్‌లో కారు ఉందన్న విషయం తెరపైకి వచ్చింది. దీంతో వారికి బిల్లులు నిలిపివేశారు. అర్హత విషయంలో అనుమానాలున్న వారిని ప్రత్యేకంగా ఓ జాబితా రూపొందించి అందులో చేర్చారు. ఈ క్యాబ్‌తో ముడిపడిన వారి పేర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు. ఇలా ఒకసారి అర్హులుగా తేల్చి ఇళ్లను మంజూరు చేసిన తర్వాత, బిల్లులు చెల్లించే సమయంలో అనర్హులుగా పేర్కొనడంతో వారు లబోదిబో అంటున్నారు. వీరంత వారివారి స్థానిక ఎమ్మెల్యేలను ఆశ్రయించడంతో.. వారిని అర్హులుగా పరిగణించాలంటూ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు