Phones Tapping : 15 రోజుల్లో 4500 ఫోన్ల ట్యాపింగ్‌!

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 కు పైగా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు తాజాగా వెల్లడైంది.

author-image
By Bhavana
Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌
New Update

Telangana : అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 కు పైగా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ కేసులో నాలుగో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్‌ పిటిషన్‌ పై శనివారం జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.

ఎన్నికల సమయంలో కేవలం 15  రోజుల వ్యవధి అంటే నవంబర్‌ 15-30 తేదీల మధ్యనే ఇన్ని ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడా ఫోన్‌, జియో నెట్‌ వర్క్‌ లకు సంబంధించినవే కాగా...మరిన్ని వందల ఎయిర్‌ టెల్‌ ఫోన్ల ట్యాపింగ్‌ డేటాను నినందితులు పూర్తిగా ధ్వంసం చేసినట్లు న్యాయస్థానానికి విన్నవించారు.

మరో వైపు రేవంత్‌ రెడ్డి సహా ఇతర నేతల, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్‌ కు సంబంధించిన సుమారు 340 జీబీ మేర సమాచారాన్ని దర్యాప్తు క్రమంలో పోలీసులు వెలికితీసినట్లు తాజాగా తెలిసింది. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటికే అభియోగపత్రాన్ని నమోదు చేశారు.

మరికొద్ది రోజుల్లో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌ రావు , శ్రవణ్‌ రావులను విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వారిద్దరి పై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ అయ్యి నిందితులిద్దరినీ భారత్‌ బలవంతంగా తిప్పిపంపేందుకు సన్నాహాలు జరుగుతాయని పోలీసులు భావిస్తున్నారు.

ఇలా నిందితులు పట్టుబడితే..అనంతరం వారిని విచారించడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న సమాచారం తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సమాచారం సేకరించిన అనంతరం దర్యాప్తు వివరాలతో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

Also Read :  రణబీర్‌ క్యారెక్టర్‌ని ఎందుకు దూషించరు? తను మగాడనా?.. త్రిప్తి అదిరిపోయే రిప్లై

#crime #elections-2024 #phone-tapping
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe